calender_icon.png 9 January, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎంపీవీతో పాఠశాలలు అప్రమత్తం

09-01-2025 01:51:06 AM

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): దేశంలో హెచ్‌ఎంపీవీ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతుండటం తో రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. కొవిడ్ సమయంలో పాటించిన ఆరోగ్య ప్రొటోకాల్‌ను తిరిగి అమలు చేయాలని విద్యార్థులకు, పేరెంట్స్‌కు స్కూళ్లు సూచనలు చేస్తున్నాయి.

హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించాలని, కరచాల నం చేయకూడదని, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ముఖానికి రుమాలు అడ్డుగా పెట్టుకోవాలని సూచనలు చేస్తున్నాయి. బహిరంగ, రద్దీ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థుల తల్లిదండులకు సలహాలు, సూచనలను జారీ చేస్తున్నాయి.

చేతులు తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, ఎక్కడికి వెళ్లినా భౌతిక దూరం పాటించాలని కోరారు. విద్యార్థులు సరిపడా నీరు తాగాలని, రోగ నిరోధక శక్తి పెంపొందిం చేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.