calender_icon.png 30 November, 2024 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల పనులు వేగవంతం చేయాలి

18-05-2024 02:22:15 AM

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, మే 17 (విజయక్రాంతి): అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హల్ నుంచి పాఠశాలల పనుల పురోగతి, గ్రామాల్లో తాగునీటి సమస్య, డంప్ యార్డుల స్థితిగతులపై అధికారులతో వీసీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ మొదటి వారంలోపు పాఠశాలల్లో అన్ని పను లు పూర్తి చేయాలని ఆదేశించారు.

మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు నీరు అందించాలని సూచించారు. నీటి సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. గ్రా మాల్లో నిరుపయోగంగా ఉన్న డంప్ యార్డులను వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించా రు. రాబోయే నాలుగు ఐదు రోజుల్లో జిల్లాలో ప్రత్యేక టీం పర్యటనకు వస్తున్నారని, అధికారులు అన్నిఏర్పాట్లు చేయాలన్నారు.   

జూన్ 12లోగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు: కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 17 (విజయక్రాంతి): వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశించారు. యూనిఫాంల కోసం వచ్చిన వస్త్రాన్ని శుక్రవారం మండలాల  వారీగా పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఈవోతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం నోట్ బుక్కులు భద్రపరిచిన గోదాంను పరిశీలించారు. పాఠశాలలు మొదలైన వెంటనే పాఠ్యపుస్తకాలు అందజేయాలని సూచించారు.