26-03-2025 03:28:23 PM
మందమర్రి,(విజయక్రాంతి): మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసమే షీటీం లు పని చేస్తున్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని షీ టీమ్ సభ్యులు కోరారు. పట్టణంలోని శివాని ఉన్నత పాఠశాలలో బుధవారం షీ టీం పనితీరుపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సభ్యులు మాట్లాడారు. ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడమే షి టీం కర్తవ్యం అన్నారు. మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వచ్చిన ఫిర్యాదుపై తక్షణమే షీటీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం జరుగుతుందని, తద్వారా ఫిర్యాదు చేసిన మహిళలకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు.
ఆకతాయిలు, ఇతరులు నుండి వేధింపులకు గురవుతున్న మహిళలు 6303923700 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలనీ సూచించారు. అలాగే అత్యవసర సమయం లో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆన్నారు.అనంతరం విద్యార్థు లకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ నేరాల గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపల్ అయిందాల రవీందర్, షీ టీం సభ్యులు మహిళ కానిస్టేబుల్ జ్యోతి, శ్రీలత, పాఠశాల ఉపాధ్యాయులు, కళాభారతి, ప్రియాంక, మహేశ్వరి, మల్లేశం విద్యార్థులు పాల్గొన్నారు.