హైదరాబాద్: హబ్సిగూడలో లారీ ఢీకొని స్కూల్ విద్యార్థిని మృతి చెందని ఘటన గురువారం చోటు చేసుకుంది. జాన్సన్ గ్రామర్ స్కూల్ లో కామేశ్వరి అనే విద్యార్థిని ఆరో తరగతి చదువుతుంది. తల్లితో పాటు విద్యార్థిని స్కూటీపై వెళ్తుండగా లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమదంలో విద్యార్థిని కామేశ్వరి తీవ్రంగా గాయపడడంతో స్థానికులు సహయంతో ఆసుపత్రికి తరలించారు. కామేశ్వరి చికిత్స పొందుతూ మృతి చెందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ ఆచుకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.