calender_icon.png 23 December, 2024 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లులు ఇవ్వలేదని బడికి తాళం

13-09-2024 02:36:06 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఇవ్వ డం లేదని కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేశాడు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో గురువారం చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు ఆరుబయట చెట్ల కింద చదువుకొన్నా రు. ప్రధానోపాధ్యాయుడి సమాచారం మేర కు డీఈవో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. తాను రూ.౩౦ లక్షలు అప్పులు చేసి పాఠశాల నిర్మాణం చేశానని, నెలకు రూ.౬౦ వేలు వడ్డీలు చెల్లిస్తున్నానని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తంచేశాడు. అధికారులు ఇకనైనా తన బిల్లులు చెల్లించాలని కోరాడు.