17-04-2025 12:39:16 AM
గాంధీనగర్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): పాఠశాల త్రివేణి సంగమం లాంటి దని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. టీచర్లను సరస్వతితో, తల్లిదండ్రులని గంగతో, విద్యార్థులని యమునతో పోల్చాలన్నారు. ఈ మేరకు బుధవారం గాంధీ నగర్ డివిజన్లోని అశోక్ నగర్‌లో గల గీతాంజలి ఉన్నత పాఠశాలలో ‘ఫ్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే‘ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందించారు. అనంతరం కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకి సంస్కృతి, సంప్రదాయాలు అలవాటు చేయాలని, మొబైల్ ని దూరంగా ఉండేలా చూడాలని కోరారు. విద్యార్థులు ప్రతి పుట్టినరోజున ఒక చెట్టు నాటాలని, పిల్లలు ఎదిగినట్లుగా మొక్క కూడా ఎదుగుతూ మనకు కావలసిన ఆక్సిజన్ ఇస్తుందన్నారు.
ఈ సందర్భంగా యాం కరింగ్ చేసిన చిన్నారి విద్యార్థుల ప్రతిభను, వారికి సహకారం అందించిన ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ కార్య క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంత, బిజెపి నాయకులు ఎ. వినయ్ కుమార్, వీ. నవీన్ కుమార్, సాయిచంద్, శ్రీకాంత్, సత్తిరెడ్డి, అభిషేక్, నీరజ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.