calender_icon.png 24 October, 2024 | 1:52 PM

ఒక్క పక్క విద్యాశాఖపై సీఎం రివ్యూ... మరోపక్క విద్యార్థుల చేత పనులు

09-07-2024 06:11:49 PM

కొత్త మొల్గర : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా విద్య శాఖ అభివృద్దిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉంటే.. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీహెచ్ఎం రంగయ్య పాఠశాల గేటు మరమ్మత్తు పనులను విద్యార్థుల చేత చేయించారు. అది గమనించిన గ్రామస్తులు జిల్లాల్లో సీఎం పర్యటించి, విద్యాశాఖపై సమీక్షిస్తుంటే.. మరో పక్క పాఠశాల జీహెచ్ఎం ముందుండి విద్యార్థుల చేత పనులు చేయించడం పట్ల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ఈ పాఠశాల మరమ్మత్తులకు రూ. 8.65 లక్షలను కేటాయించగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మరో రూ. 3.50 లక్షల నిధులను కేటాయించి పనులను చేపట్టింది. కాగా ప్రభుత్వo ఉన్నత లక్ష్యంతో ముందుకు నడుస్తుంటే కొందరు ఉపాధ్యాయుల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా విద్యార్థుల చేత పనులు చేయించడం మానుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులు గేటు మరమ్మత్తు పనులు చేస్తుండగా ఆ పాఠశాల పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పర్యటనకు వచ్చిన ఎంపీడీవో ఉండటం కొసమెరుపు.