04-03-2025 10:58:07 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ లో గల త్రివేణి పాఠశాలలో మంగళవారం రాత్రి ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులు తొమ్మిది, పదవ తరగతుల విద్యార్థులకు ఫేర్ వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ప్రిన్సిపల్ జి. నేతాజీ అధ్యక్షత వహించగా పాఠశాల డైరెక్టర్లలో ఒకరైనటువంటి గొల్లపూడి జగదీష్, పట్టణ స్థానిక కోర ఆసుపత్రి వైద్యులు కోర శ్రీ యాదవ్, డాక్టర్ పృధ్వీ చంద్ర ముఖ్య అతిధులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జి.నేతాజీ వార్షిక నివేదికను చదివి వినిపించిన తరువాత పాఠశాలలో జరిగిన బాహ్య అంతర స్థాయి పోటీ పరీక్షలలో ఉత్తిర్ణులయిన వారికి ప్రశంస పత్రాలను, మెమొంటోలను అతిధుల సమీక్షంలో ఇవ్వడం జరిగినది.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి , కృష్ణవేణి & త్రివేణి సంస్థల డైరెక్టర మాచవరపు కోటేశ్వర్ రావు,సి ఆర్ ఓ కాట్రగడ్డ మురళి కృష్ణ మాట్లాడుతూ... విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసే సదవకాశం ఈ వేడుకలు అని అందుకే విద్యార్థుల అందరిని ఈ వేడుకలలో పాల్గొనేలా చేసినట్లయితే వారితో నూతనోత్సహాన్ని నింపగలుగుతున్నారని అప్పుడే సమాజానికి మంచి యువత తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కిడ్స్ ఇంచార్జ్ జి. కవిత ఇంచార్జ్ సురేష్ , పాటశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.