calender_icon.png 12 April, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి

04-04-2025 10:12:03 PM

నడిగూడెం: విద్యార్థులు ఎంచుకునే లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని,  అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరము శ్రమించాలని నడిగూడెం తాసిల్దార్ వి. సరిత అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం స్కూల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యను బోధిస్తున్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి దాసరి సంజీవయ్య మాట్లాడుతూ... గురుకుల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారని కొనియడారు. వీరి వెనక ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహము ఎంతగానో ఉందన్నారు. ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. డాక్టర్ విద్యాసాగర్, ఎస్సై అజయ్ కుమార్ మాట్లాడుతూ తాము కూడా రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగామన్నారు. రెసిడెన్షియల్ విద్య పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమాజంలో గుర్తింపు కలగాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. చదువుతోనే విజ్ఞానము వస్తుందని ఆ తర్వాత జీవితములో స్థిరపడతామన్నారు. ఎంతోమంది విద్యార్థులకు గురుకుల పాఠశాలలు ఉన్నతంగా ఎదగటానికి తోడ్పడ్డాయి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వచ్చిన అతిథులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.