22-03-2025 02:02:37 AM
న్యూయార్క్, మార్చి ౨౧: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. దేశంలో విద్యాశాఖను పూ మూసివేయాలని విద్యా మంత్రి లిండా మెక్‌మోహన్‌ను ఆదేశించారు. విద్యాశాఖలో కీలకమైన సేవలు, కార్యక్రమాలను కొనసాగించాలని మెక్‌మోహన్‌కు ట్రంప్ సూచిం చారు. వైట్‌హౌస్‌లో గురువారం పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ విద్యాశాఖ మూసి వేత ఉత్తర్వులపై సంతకం చేశారు. ‘అతి త్వరలోనే దీనిని అమలు చేయనున్నాం. ఈ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని పేర్కొన్నారు.