త్రుటిలో తప్పిన ప్రమాదం
ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థులు
కామారెడ్డి జిల్లా చిట్యాలలో ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి విద్యార్థుల కోసం శనివారం ఉదయం వెళ్ళింది. విద్యార్థులను స్కూల్ బస్సులో ఎక్కించుకొని తిరిగి వస్తుండగా చిట్యాల గ్రామ శివారులో అదుపుతప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు రోడ్డు కిందికి దూసుకెళ్లింది. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ ఆజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. బస్సులో ఉన్న విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ప్రవేట్ పాఠశాలల బస్సులు విద్యార్థుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి.
చిట్యాలలో జరిగిన సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లను మంచివారిని పెట్టుకొవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురై కేకలు వేశారు. మరికొందరు విద్యార్థులు ఏడుపులతో ఆందోళనకు గురయ్యారు. ఏ విద్యార్థికి కూడా ఏమి కాకపోవడంతో బస్సు వెంటనే ఆగిపోవడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలిపారు.