calender_icon.png 11 March, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను ఢీకొట్టిన స్కూల్‌బస్సు

11-12-2024 02:09:14 AM

  1. నవ వరుడు దుర్మరణం
  2. చేవెళ్ల మండలం ఎన్కెపల్లి సమీపంలో ఘటన

చేవెళ్ల, డిసెంబర్ 10: స్కూల్ బస్సు బైక్‌ణు ఢీకొట్టిన ఘటన లో ఓ యువకుడు అక్కడిక్కడే దుర్మరణం చెందా డు. పోలీసులు తెలిపిన వివరాలు.. చేవెళ్ల మండలం మొండి వాగుకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్(22)కు ఆరునెలలకిందట వివాహం జరిగింది. సెంట్రింగ్ పనిచేస్తూ భార్య, తల్లిదండ్రులను పోషిస్తున్నాడు.

మంగళవారం ఇమ్రాన్ బైక్‌పై వ్యక్తిగత పనిమీద ఎన్కెపల్లికి బయల్దేరాడు. ఎన్కెపల్లి పరిధిలోని మోడీ వెంచర్ సమీపంలోకి రాగానే.. చేవెళ్లలోని శ్రీస త్యసాయిగ్రామర్ హైస్కూల్‌కు చెందిన బస్సు వేగంగా వచ్చి ఇమ్రాన్ బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇమ్రాన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తే కారణమని పోలీసులు గుర్తించారు. ఇమ్రాన్ తండ్రి నయీమ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ రెడ్డి తెలిపారు.