డ్రైవర్ పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
కాగజ్ ఘాట్ లోని సిరి నేచర్ రిసార్ట్ లో ఘటన
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): స్కూల్ బస్సు డ్రైవర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి అభంశుభం తెలియని ఆరేండ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధి కాగజ్ ఘాట్ గ్రామంలోని సిరి నేచర్ రిసార్ట్ కి ఈ నెల 4వ తేదిన ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులను పిక్నిక్ కు తీసుకోచ్చారు. కాగా ఓ బాలిక (6)ను స్కూల్ బస్సు డ్రైవర్ రిసార్ట్ లోని బాత్ రూంలోకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ పై పోక్సో కేసు తో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.