calender_icon.png 4 December, 2024 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల బస్సు - ట్రాలీ ఆటో ఢీ

03-12-2024 08:14:06 PM

తృటిలో తప్పిన భారీ ప్రమాదం

గాయలతో బయటపడ్డ ఇద్దరు డ్రైవర్లు 

పాపన్నపేట: పాఠశాల బస్సు, ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లకు గాయాలైన సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ మంజీరా నది బ్రిడ్జిపైన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తమ్మలపల్లి గ్రామానికి చెందినటువంటి ట్రాలీ ఆటో ఎల్లాపూర్ బ్రిడ్జిపై ఒక్కసారిగా అదుపుతప్పి మెదక్ నుండి పాపన్నపేట వైపు వస్తున్నటువంటి మెదక్ పట్టణానికి చెందిన సెయింట్ డాన్ బాస్కో పాఠశాల బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో పాఠశాలకు చెందినటువంటి బస్సులో సుమారు 15 మందికి పైగా విద్యార్థులు ఉండడంతో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద స్థాయిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయని విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం మండల పరిధిలోని నార్సింగ్ గ్రామంలో ఇంటర్ కళాశాల విద్యార్థిని బస్సు ప్రమాదం మరువకముందే నేడు మరో పాఠశాల బస్సుకు ప్రమాదం జరగడంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.