22-04-2025 01:59:16 AM
యాచారం, ఏప్రిల్ 21 :రాబోయే విద్యా సంవత్సరానికి 2025 -2026 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాల్, ప్రధానోపాధ్యాయులు ఎన్.విమల అధ్యక్షతన సోమవారం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, వి ద్యార్థుల సమక్షంలో బడిబాట కరపత్రాలు ఆవిష్కరించారు.
అనంతరం మంతన్ గౌరెల్లి గ్రామంలో ఉపాధ్యాయులందరూ ఇంటింటికి తిరుగుతూ ప్రైవేటు పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాల ముద్దు అంటూ ప్రవేట్ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించ వలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రుల కోర డం జరిగింది.
ఈ సందర్భంగా హెడ్ మాస్ట ర్ విమల మాట్లాడుతూ.. ప్రవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులు స్పందించి వచ్చే విద్యా సంవత్సరంలో తమ తమ పిల్లలను తప్పనిసరిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాల్ లో చేర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.