04-04-2025 06:13:11 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాసిపేట మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చక్కని ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.