05-04-2025 09:29:09 PM
నాయకుల రాక కోసం పడిగాపులు కాసిన విద్యార్థిని విద్యార్థులు
విద్యార్థులను అసౌకర్యా నీకి గురిచేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి
కొల్చారం,(విజయక్రాంతి): పాఠశాల వార్షికోత్సవం రాజకీయ నాయకుల స్వార్థం కోసం విద్యార్థులను అసౌకర్యా నీకి గురిచేస్తూ 9 గంటల వరకు పడి కాపులు కాయించారు దీంతో విద్యార్థుల్లో వార్షికోత్సవ ఉత్సాహమే లేకుండా పోయింది. పాఠశాల వార్షికోత్సవం రాజకీయ లబ్ధికి ఉపయోగించడంపై శనివారం పోతంశెట్టిపల్లి చౌరస్తా టీ జంక్షన్ వద్ద భాజపా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా మండల శాఖ అధ్యక్షులు పంతులు హరీష్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలకు ప్రజా పాలన ఉంటే చెప్పుకునే దానికి పొంతన లేకుండా పోతుందని ఎద్దేవా చేశారు. కొల్చారం మండల పరిధిలోని చిన్న ఘనపూర్ లో శుక్రవారం నిర్వహించిన పాఠశాల యాన్యువల్ డే కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించుకొని విద్యార్థులను ,తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను అసౌకర్యానికి గురి చేసే విధంగా ఉన్నదన్నారు.
పాఠశాల వార్షికోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించుకుని విద్యార్థులకు పాఠశాలలో జరిగిన అనుభూతులు పై చదువులకు వెళ్లడానికి ఎన్నో మంచి విషయాలను తెలియ చేసుకోవడానికి వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు ఓ గొప్ప వక్త గాని లేదా ఒక ఉన్నత స్థాయి అధికారులను తీసుకొచ్చి ప్రసంగిస్తే విద్యార్థులలో కొత్త ఉత్సాహం వచ్చి తదుపరి భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉండేదని అన్నారు. కానీ విద్యార్థుల వార్షికోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమం చేసి ఆరు గంటలకు ప్రారంభించవలసిన వార్షికోత్సవ కార్యక్రమం రాత్రి 8:30 గంటల వరకు రాజకీయ నాయకుల కోసం పడిగాపులు కాయ వలసిన దుస్థితి నెలకొంది అన్నారు.
అలాగే పాఠశాలకు ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిధులు కేటాయించలేదని కేవలం ప్రధానమంత్రి పథకంలో మండల ప్రాథమిక పాఠశాల డెవలప్మెంట్ చేయడం జరిగిందని కానీ దీన్ని అధికారులు గుర్తించలేదు అని మండల పార్టీ అధ్యక్షుడు హరీష్ తెలిపారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ఇస్తున్న రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను తెలంగాణ ప్రజలలో అమలు కాలేదని ఉన్న ఆగ్రహాన్ని తొలగించుకోవడాని కి జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్రం నుంచి ఇస్తున్న మేస్తున్నామని అలాగే సన్న బియ్యం కూడా మేమేస్తున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వెల్లడించారు . ప్రతి రేషన్ షాపులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేయాలని అన్నారు.