09-04-2025 07:17:14 PM
ఘనంగా పాఠశాల వార్షికోత్సవం..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని వాణి విద్యాలయం హై స్కూల్ లో మంగళవారం పాఠశాల ఆవరణంలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఉప్పునూతుల శ్యామ్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉప్పునూతుల నాగరాజ్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం జరిగింది. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ... నేటి బాలలే రేపటి భారత పౌరులని అన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొని శారీర, మానసిక ఆనందాన్ని పొందాలని అన్నారు. విద్యార్థులు చదువులో, క్రీడల్లో బాగా రాణించి తల్లిదండ్రులకు, తమ పాఠశాలకు, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, తద్వారా మన దేశానికి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రతి విద్యార్థి తమకు సాధ్యమైనంత మేరకు సామాజిక సేవా కార్యక్రమాలలొ పాల్గొనాలని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్యామ్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థి విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమం అనంతరం ప్రముఖ మెజీషియన్ సంతోష్ తన మ్యాజిక్ కార్యక్రమాలతో పిల్లలని, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అలరించారు. నర్సరీ విద్యార్థుల నుండి మొదలు అన్ని తరగతుల విద్యార్థిని, విద్యార్థులు వివిధ సినిమా, ఫోక్ పాటలపై డాన్స్ లు చేసి అందర్నీ అలరించారు. ఈ కార్యక్రమం ఉదయం నుండి రాత్రి వరకు నిర్విరామంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగరాజ్ గౌడ్ ఉప్పునూతుల, పాఠశాల గౌరవ అధ్యక్షురాలు లక్ష్మమ్మ, పాఠశాల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ శ్యామ్ రాజ్, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఉప్పునూతుల శ్రీదేవి, పాఠశాల డైరెక్టర్ నిశాంత్ ఇంచార్జ్ రవికిరణ్, పాఠశాల ఉపాధ్యాయులు స్రవంతి, సంద్యా, స్వప్న, మహేశ్వరి, నిహారిక, మమత, రజిత, మౌనిక, రేణుక తదితరులు పాల్గొన్నారు.