భీమదేవరపల్లి, డిసెంబరు 11: ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి నుంచి 10 వతరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సూచించారు. విద్యార్థులు ఆధార్‌కార్డు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటో, మొబైల్ నంబరు, రేషన్ కార్డు వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. 5 నుంచి 7 వతరగతి విద్యార్థులకు రూ.1,500, 8 వ తరగతికి రూ.3 వేల అందించనున్నట్లు తెలిపారు.