calender_icon.png 16 April, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్‌సెట్ మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్

16-04-2025 12:37:23 AM

మల్లారెడ్డి యూనివర్సిటీ ఆధ్వర్యంలో 20న మాక్‌టెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఎప్‌సెట్) కి అర్హులైన విద్యార్థులకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆధ్వర్యంలో టీజీఎప్‌ఎసెట్ ఆన్‌లైన్ మాక్ టెస్ట్-2025 సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మాక్ టెస్ట్ విద్యార్థులకు తమని అంచనా వేసుకోవడానికి, పరీక్షకు ముందు నమ్మకాన్ని పెంచుకో వడానికి ఉపయోగపడుతుంది.

ఈ 20న ఆన్‌లైన్‌లో టెస్ట్ నిర్వహిస్తారు. మల్లారెడ్డి వర్సి టీ 500 మెరిట్ ఆధారిత అడ్మిషన్లకు మెరిట్ స్కాలర్‌షిప్స్‌ను ప్రకటించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి, వారికి ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. అన్ని కోర్సులకు మొదటి 500 మెరిట్ ఆధారిత అడ్మిషన్లకు అర్హులు. 

యూనివర్సిటీకి సంబంధించిన వివరాలు కోసం  మల్లారెడ్డి వర్సిటీ వెబ్‌పోర్టల్‌లో సంప్రదించవచ్చు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్, ఫౌండర్ చామకూర మల్లారెడ్డి, వైస్ చాన్సలర్ వి.యస్.కె.రెడ్డి, డైరెక్టర్ డా.చామకూర భద్రారెడ్డి పాల్గొన్నారు.