calender_icon.png 31 March, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపకార వేతనాల గడువు పెంపు

29-03-2025 01:11:06 AM

మైనారిటీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకుబ్ పాష

పాల్వంచ,(విజయక్రాంతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు  ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని మే 31వ తేదీ వరకు పొడిగించటం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకుబ్ పాషా శుక్రవారం  ఒక ప్రకటనలో తెలిపారు.11,88,120 ధరఖాస్తుల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10,34,074 ధరఖాస్తులు చేసుకున్నారని,ఇంకా సుమారు 1,54,046మంది ధరఖాస్తు చేసుకోవాల్సి ఉందని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గడువు తేదీని మే 31వరకు పొడిగించటం జరిగిందన్నారు. కావునా ఇట్టి అవకాశాన్ని ఎస్.సి, ఎస్.టి, ఈబిసి, మైనారిటీ ,దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.