calender_icon.png 27 February, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కులు అందజేత

27-02-2025 12:12:45 AM

మహేశ్వరం, ఫిబ్రవరి26(విజయ క్రాంతి).. మహేశ్వరం మండల బిజెపి అధ్యక్షులు యదిష్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి  జన్మదిన వేడుకల సందర్భంగా జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ పేరిట మహేశ్వరం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో అగ్రస్థానం మార్కులు సాధించిన  విద్యార్థిని విద్యార్థులకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి ఎంపీ కొండా వివేశ్వరరెడ్డి స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.