22-03-2025 12:00:00 AM
జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఉపసంచాలకులు జి.ఆశన్న
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21(విజయక్రాంతి) : హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, యూనివర్సిటీ, ఇంజనీరింగ్, నర్సింగ్, ఇతర కాలేజీల యజమాన్యములు ఈ నెల 24లోగా విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులను సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఉపసంచాలకులు జి.ఆశన్న తెలిపారు.
తమ తమ కాలేజీ విద్యార్థులకు సంబందించిన ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫార్మ్స్ (హార్డ్ కాపీస్) 2017 నుంచి 2024 వరకు ఉన్న పెండింగ్ అప్లికేషన్లు (హార్డ్ కాపీస్) లను జిల్లా, వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ట్యూషన్ ఫీజుకు సంబందించి చాలా అప్లికేషన్లు నో ఫీజు అని ఈపాస్ వెబ్ సైట్ లో చూపిస్తున్నాయని, కాలేజీ యజమాన్యాలు సంబంధిత డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ గాని, పీఎంయూ సెంటర్‌ను గాని సంప్రదించి ఫీజు స్ట్రక్చర్‌ను ఈపాస్‌లో అప్డేట్ చేయించుకోవాలని సూచించారు.
లేదంటే అట్టి కాలేజీలకు స్కాలర్షిప్ . ట్యూషన్ ఫీజు రాకపోతూ దానికి కాలేజీ ప్రిన్సిపాళ్లు, యజమాన్యం పూర్తి భాద్యత సంబంధిత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వారిపై శాఖాపరమైన చర్యల కొరకు సంబంధిత పై అధికారులకు సిఫారసు చేస్తామని పేర్కొన్నారు..