calender_icon.png 16 January, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ పథకాలు చేరాలి

16-01-2025 12:59:47 AM

 ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, తదితర అంశాలపై  సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష 

పెద్దపల్లి, జనవరి 15: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పట్టిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు.  బుధవా రం మంథనిలోని శ్రీ లక్ష్మీ భారతి ఫంక్షన్ హల్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీ, తదితర అంశాలపై నిర్వహించి న మంథని నియోజకవర్గ స్థాయి సమన్వ య సమావేశంలో జిల్లా కలెక్టర్  అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయబోతున్న 4 నూతన పథకాల కు అర్హులైన లబ్ధిదారులను, అనర్హులను ఎంపిక చేసి గ్రామ సభ ల ద్వారా ఆ జాబితా ను ఆమోదింప చేసుకోవాలని అన్నారు. గ్రా మ సభ ల ద్వారా ఆమోదింప చేసుకున్న జాబితా జనవరి 25 లోపు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు.

రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి మండలంలోని తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ విస్తరణ అధికారు లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్,  సర్వేయర్లు, మైనింగ్ , సంబంధిత అధికారులు సంయుక్తంగా పని చేసి పట్టా దార్ పాస్ పుస్తకాల డేటా, గూగల్ మ్యాప్ , రెవెన్యూ మ్యాప్ వారీగా పరిశీలిస్తూ భూ భారతి (ధరణి) నుంచి వ్యవ సాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్దిదా రులను  తొలగించాలన్నారు.

రాళ్లు రప్పలు ఉన్న భూములు,   సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి  భూ సేకరణ చేసిన భూములు,  పరిశ్రమల  భూములు (రైస్ మిల్ పెట్రోల్ బంక్,  ఆహార శుద్ధి పరి శ్రమ), నాలా కన్వర్షన్ జరిగిన భూములు, లేఔట్ ఉన్న భూములు, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తు భూములు, రొడ్ల భూములు, భవనాలు నిర్మించుకున్న భూముల, మైనిం గ్ జరుగుతున్న భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలన్నారు. 

భూమి లేని వ్యవసాయ కూలీల కుటుం బాలకు ఏడాదికి రూ. 12,000 వేలు రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందని, 2023-24  సంవత్సరా నికి 20 రోజులు పని చేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంద న్నారు.  ఈ పథకం కుటుంబం యూనిట్ గా అందించడం జరుగుతుందని, వ్యక్తిగతం గా అందించే పథకం కాదన్నారు. 

ప్రతి రెవెన్యూ గ్రామాన్ని జీపి వారిగా మ్యాప్ చేయాలని, జిల్లాలో  20 రోజులు  ఉపాధి హామీ కూలీలుగా పని చేసిన కార్మి కుల జాబితాను తీసుకొని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమిలేని కుటుంబాలను ఎంపిక చేయాలని,  గ్రామ సభలో ఎంపిక చేసిన జాబితా పై ఏవైనా అభ్యంతరాలు వస్తే సంబంధిత ఎంపిడీఓ 10 రోజుల లోగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సామాజిక ఆర్థి క సర్వే కింద మన పెద్దపల్లి జిల్లాలో తేలిన ఆహార భద్రత కార్డులు లేని  కుటుంబాలకు  మండలాలలో ఎంపీడీవోలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్ లు  నూతన రేషన్ కార్డుల జారీ పర్యవేక్షించాలని,  గ్రామ లేదా వార్డు సభల ద్వారా అర్హులైన జాబితాన్ని ఆమోదింప చేసుకొని రేషన్ కార్డులను 75 గణతంత్ర దినోత్సవ సందర్భంగా నూతన రేషన్ కార్డుల ప్రోసిడింగ్స్ పంపిణీ చేయాల న్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు సంబం ధించి  నిర్వహించిన సర్వేలో భూములు ఉన్న అ త్యంత పేదలకు మొదటి జాబితాలో ఇందిర మ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుం దని, రాష్ర్ట ప్రభుత్వ స్థాయిలో స్క్రూటినీ నిర్వహించి 13.9 లక్షల దరఖాస్తు లను మొదటి విడతలో పరిశీలనకు జిల్లా లకు  అందిస్తున్నారని, మనకు  వచ్చిన దరఖాస్తు లను మరొకసారి చెక్ చేసుకోని, గ్రామాల వారీగా అర్హులను ఎంపిక చేసుకొవాలని, ఎటువంటి ఒత్తిడులకు గురికాకుండా అత్యం త పేదలను ఎంపిక చేయాలని, గ్రామ సభ లు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న 4 కార్యక్రమాల మార్గదర్శకాలు, ఉద్దేశం ప్రజల కు వివరిస్తూ పథకాల అర్హుల జాబితా ను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని, ప్రజ ల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరిం చిన తర్వాత తుది జాబితా తయారు చేయా లన్నారు.

జనవరి 23లోపు గ్రామ సభల ని ర్వహణ పూర్తి చేయాలని, గ్రామసభ ఆమో దించిన తరువాత తుది జాబితా ఆన్ లైన్ లో జనవరి 25 సాయంత్రం లోపు నమోదు చేయాలని, జనవరి 26 నుంచి 4 పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ అన్నా రు. కార్యక్రమంలో  జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి ఎం. కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జడ్పీసీఈవో, జిల్లా మార్కె టింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, మంథని రెవె న్యూ డివిజన్ అధికారి సురేష్ పాల్గొన్నారు.