calender_icon.png 16 January, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాలు అర్హులకు మాత్రమే అందాలి

16-01-2025 12:36:55 AM

* పలు సంక్షేమ పథకాలపై నోడల్ అధికారులతో సమీక్ష

* కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జనవరి 15 (విజయక్రాంతి):  రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారు లకు మాత్రమే అదేవిధంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. 

జనవరి 26 నుండి ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిర మ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి ప్రతిష్టాత్మక పథకాలు వాస్తవంగా అర్హులైన వారికే అందే విధంగా జనవరి 16 నుండి 20 వరకు  క్షేత్రస్థాయిలో సర్వే నిర్వ హించాలని ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సర్వే లో అర్హులైన తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు దారులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంటుందన్నా రు. రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది,   పంచాయతీ సెక్రటరీ, వ్యవసాయ విస్తీర్ణా ధికారులు నిర్వహించే ఈ సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు,  ప్రత్యేక మండల అధికారులను నియమించి తహశీల్దార్లు, ఎంపీడీఓలకు సైతం బాధ్యత లు అప్పగించడం జరిగిందన్నారు. 

తెల్ల రేషన్ కార్డులు

ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుల కొరకు  దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను సమగ్ర పరిశీలన అనంతరం వనపర్తి జిల్లాలో  66 47 దరఖాస్తులు తుది పరిశీలనకు రావడం జరిగిందని, వీటిని జనవరి 16 నుండి 20వ తేది వరకు జరిగే సర్వేలో నిర్ధారించి తదుప రి 21 నుండి 24 వరకు జరిగే గ్రామ సభల ద్వారా తీర్మానం చేయాల్సి ఉంటుంద న్నారు. 

 ఇందిరమ్మ ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్ళకై 142075 మంది  దర ఖాస్తు చేసుకోగా ఇంటింటి సర్వే అనంతరం వనపర్తి జిల్లాలో 36206 దరఖాస్తులు తుది జాబితాలో వచ్చాయి. తుది జాబితాలో వ చ్చిన దరఖాస్తు దారుల వివరాలను జనవరి 16 నుండి 20 వరకు జరిగే క్షేత్ర స్థాయి సర్వేలో మరోమారు పరిశీలించి  గ్రామ సభలో పెట్టాల్సి ఉంటుందని సూచించారు. 

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

వ్యవసాయ భూమిలేని నిరుపేద కుటుం బాలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు జిల్లా లో 121844 జాబ్ కార్డు కలిగి ఉండగా 2023-24 సంవత్సరంలో  కనీసం 25 రోజు లు ఉపాధిహామీ పథకంలో పని చేసి ఉండి కుంట భూమి లేని కుటుంబాలకు ఇందిర మ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వెలు ఆర్థిక సహాయం చేయడం జరుగు తుంది. వనపర్తి జిల్లాలో ఇలాంటి కుటుంబా లు 49,354 ఉన్నట్లు రాష్ర్ట నివేదికలో గుర్తించడం జరిగిందని, ఈ నాలుగురోజుల సర్వేలో అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించా ల్సి ఉంటుందన్నారు. 

రైతు భరోసా

వ్యవసాయ యోగ్యత కలిగిన భూముల ను గుర్తించి రైతు భరోసా ఇచ్చేందుకు మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో జనవరి 16 నుండి 20 వరకు జరిగే సర్వేలో వ్యవ సాయ యోగ్యం లేని భూములు ఇళ్ల స్థలా లు, లే అవుట్లు, భూసేకరణ చేసిన స్థలాలు, ఎండోమెంట్  భూములు వంటివి గుర్తించి నివేదికను ఆన్లైన్‌లో నమోదు చేయాల్సి ఉం టుందని తెలియజేశారు.

అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, రైతు భరోసా నోడల్ అధికారి గోవింద్ నాయక్, రేషన్ కార్డుల నోడల్ అధికారి కాశి విశ్వనాథ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నోడల్ అధికారి ఉమాదేవి, ఇందిర మ్మ ఇళ్లు నోడల్ అధికారి విటోబా, జడ్పి సి. ఈ ఓ యాదయ్య, డి.పి. ఒ సురేష్, కొత్తకోట మున్సిపల్ కమిషనర్ పవన్ పాల్గొన్నారు.