సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులకు మాత్రమే మంజూరు చేయాలని సింగిల్ విండో చైర్మన్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం వావుదం గ్రామపంచాయతీ ఆవరణలో చేపట్టిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు పథకాల అమలులో అన్యాయం జరగద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.