జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, జనవరి 2 ( విజయక్రాంతి) : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అరులైన ప్రతి ఒక్కరికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషితో పని చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. గురువారం ఐ.డి.ఓ.సి సమావేశం హాల్ నందు నూతన సంవత్సరం వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేశారు.
నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి కొత్త ఉత్సాహంతో అన్ని శాఖల అధికారులు పని చేయాలన్నారు. గత ఏడాది తనకు జిల్లాలో పూర్తి చేసిన తొలి సంవత్సరంగా చాలా విలువైన అనుభవా లను అందించిందని తెలిపారు. గత ఏడాది ప్రారంభ స్థాయి నుండి నేర్చుకోవడం జరిగిందని, ఇప్పుడు మరో సంవత్సరం కో సం ప్రణాళికతో, కట్టుదిట్టమైన లక్ష్యాలతో పనిచేస్తామన్నారు.
2024లో వెనుకబడ్డ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఈ ఏడా దికి సమగ్ర ప్రణాళికలతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఒక ఫైల్ కేవ లం పత్రం కాదని,అది ఒక జీవితమని ప్రతి ఫైల్ వెనుక ఉన్న భావాలు,అవసరాలు గుర్తించి, నిబంధనలతో పూర్తి చేయాల న్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా, ప్రతి అధికారి తన పాత్రను జవాబుదారీతనంతో విధులను నిర్వర్తించా లని అన్నారు.
సృజనాత్మక ఆలోచనలతో, టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించి, వేగంగా,నాణ్యతతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సేవలు దైవ కార్యమని, అధికారు లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నూతన సంవత్స రంలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని మరింత పట్టుదలతో పని చేయాలన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా అధికారులలో కలసి కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగా రావు, ఆర్డీఓ శ్రీనివాస రావు,ఎ.ఓ. వీర భద్రప్ప, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.