calender_icon.png 2 February, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అమలు చేయాలి

28-01-2025 10:55:19 PM

సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ...

మునగాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నో రకాల హామీలను ఇచ్చి కాలయాపన చేయడం దురదృష్టకరమని మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో రకాల హామీలు ఇచ్చి దానికి తోడు వారి కేంద్ర పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు అయిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లాంటి నాయకులను తీసుకుని వచ్చి వారితో కూడా చెప్పించారు. అలాగే వారి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారు, తదుపరి అదికారం చేపట్టిన తర్వాత వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విస్మరించారు.

ఆపైన పార్లమెంటు ఎన్నికల్లో దేవుళ్ల మీద ఒట్లు వేసి నమ్మించి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా అమలు చేస్తామని ఆ తదుపరి డాక్టర్ అంబేద్కర్ గారి సాక్షిగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26వ తేదీన కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా  రైతు భరోసా ఇలా నాలుగు పధకాలను అమలు చేస్తామని చెప్పి ఆరోజు అర్థరాత్రి నుంచి అర్హులైన వారి అకౌంట్ లలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమౌంట్ వేస్తామని చెప్పి చివరికి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి కేవలం ఆయా గ్రామాల్లో పూర్తిగా అర్హత గల వారిని కూడా విస్మరించటం బాధాకరమని, రాష్ట్ర ప్రజలను వారి పార్టీ అదినాయకులను దేవుళ్లను చివరికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా చెప్పి ఇలా అందరిని మోసం చేయడం అత్యంత బాధాకరమని ప్రజలు మీ మీద నమ్మకంతో అధికారం ఇస్తే ఇలా చేయడం వంచించడమేనని నాడు ఇచ్చిన హామీలను వెంటనే బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.