భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పోలీస్ శాఖలో నిర్వహించే విధుల పట్ల తమ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నామని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఈ నెల మూడు నాలుగు తేదీల్లో వరంగల్లో నిర్వహించిన జోనల్ స్థాయి పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 22 పథకాలు కైవసం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. 13వ తేదీ నుంచి హైదరాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి డ్యూటీ మీటిలోనూ అత్యంత ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించాలని ఎస్పీ కోరారు. గురువారం జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆయన అభినందించారు .