రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ దినోత్సవం
హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో.. మధ్యాహ్నం ప్రారంభం
- అనర్హులకు లబ్ధి చేకూరితే చర్యలు
- నాలుగు పథకాలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- నేడు కోస్గి మండలం చంద్రవంచలో కొత్త స్కీములు ప్రారంభించనున్న సీఎం
మండలానికి ఓ గ్రామం.. వందశాతం అమలు
మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్.. ఇండ్ల కేటాయింపులో అవినీతికి తావు లేదు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జనవరి 25 ( విజయక్రాంతి): అర్హులందరికీ రైతు భరోసా, ఇంది రమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్న ద్ధం అయ్యింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇంది రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలకు సంబంధించి శనివారం ఇంటిగ్రెటేడ్ కమాండ్ కంట్రోల్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సం బంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న నాలు గు పథకాల్లో అనర్హులకు లబ్ధి చేకూరితే చర్య లు తప్పవని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. నాలుగు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని చెప్పారు. గతంలో ఎప్పుడు ఒకేసారి నాలుగు పథకాలను ప్రారంభించలేదన్నారు.
ప్రజల సంక్షే మం, అభివృద్ధి కోసమే ఇందిరమ్మ పాలన సాగుతోందన్నారు. ఏ ఒక్క అర్హుడికీ అన్యా యం జరగొద్దని, అందుకు ప్రతీ అంశాన్ని అధికారులు క్షుణ్నంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. అనర్హులకు లబ్ధి చేకూర్చితే ఆయా అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.
సమీక్షా సమావేశం లో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. నాలుగు పథకాలను సీఎం నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచలో ప్రారంభించనున్నారు.
ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు: డిప్యూటీ సీఎం భట్టి
ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం నాలుగు పథకాలను ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను చేరవేస్తామని చెప్పారు. అర్హుల్లో ఏ ఒక్కరూ మిగలకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా పథకాలను అమలు చేస్తామని తేల్చి చెప్పారు.
శనివారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో నాలుగు పథకాలకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయన్నాయన్నారు. ఇందులో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ అప్లికేషన్లు వచ్చినట్లు వెల్లడించారు.
వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జనవరి 26వ తేదీన పథకాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని నాలుగు పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని భట్టి పేర్కొన్నారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చినందు వల్ల అప్లికేషన్లను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేయడం ఆలస్యమవుతుందన్నారు.
అందుకే లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ మార్చి వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని డిప్యూటీ సీఎం చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా, భూమిలేని పేదలు, కనీసం 20రోజుల పాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అందజేయనున్నట్లు చెప్పారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం: మంత్రి ఉత్తమ్
మండలానికో యూనిట్‌గా ఎంపిక చేసిన గ్రామాల్లో రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలను గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 గంటల వరకు ప్రతీ మండలంలోని ఓ గ్రామంలో ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు.
గ్రామ సభల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోని వారు.. ప్రజాపాలన సెంటర్లలో ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. అర్హత ప్రకారం ఆ అప్లికేషన్లను అధికారులు పరిశీలిస్తారన్నారు. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో ఆహార భద్రతకు చొరవ చూపలేదన్నారు.
రాష్ట్రంలో పేదలందరికీ ఆహారభద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. పదేళ్ల పాటు గత ప్రభుత్వం రేషన్‌కార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించిందన్నారు.
గత పదేళ్లు దొడ్డు బియ్యం ఇచ్చారని విమర్శించారు. కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత తాము ఒకరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నామని చెప్పారు. దేశంలోనే ఇది విప్లవాత్మక మార్పు కాబోతోందని మంత్రి అన్నారు.
ఒకేరోజు నాలుగు పథకాలు చారిత్రాత్మకం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏకకాలంలో నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత కల్పించబోతుందని, రాష్ట్రంలోని 70 నుంచి 73 శాతం వరకు ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సిద్ధాంతాలైన సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని స్పష్టంచేశారు.
అర్హులందరికీ తెల్లరేషన్‌కార్డులు..
అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. సామాజిక ఆర్థిక సర్వేలు, ప్రజాపాలన, ప్రజావాణి, మీసేవా కేంద్రాల ద్వారా నమోదు చేసిన దరఖాస్తుదారులను పూర్తిస్థాయిలో కవరేజ్ చేసేలా కార్డులను జారీ చేస్తామన్నారు. జాబితాలో లేనివారు ప్రజా పాలన సేవా కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ప్రక్రియ ప్రతీ అర్హులైన కుటుంబాలకు చేరేవరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ముగిసిన తర్వాత పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా అందించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆహార భద్రతను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ పదేండ్ల నిర్లక్ష్యాన్ని సరిదిద్దే చారిత్రాత్మక నిర్ణయంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
ఏడాదిలోనే రైతుల ఖాతాలో రూ.30వేల కోట్లు: మంత్రి తుమ్మల
ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం రైతుల ఖాతాలో దాదాపు రూ.30వేల కోట్లను జమ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందులో రైతు రుణమాఫీ రూ.21వేల కోట్లు, రైతు బంధు రూ.7వేల కోట్లు, రైతు బీమాకు రూ.3వేల కోట్లు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఇంకో రూ.10వేల కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు.
అంటే మొత్తం రూ.40వేల కోట్లను ప్రభుత్వం నేరుగా రైతుల పంపిణీ చేసిందన్నారు. సబ్సిడీ, బోనస్, ఎంఎస్‌పీ వంటివి కాకుండానే ప్రభుత్వం రైతుల కోసం భారీగా ఖర్చు చేసిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మొదటి ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఖర్చు చేయలేదన్నారు.
అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా చిత్తశుద్ధితో నాలుగు పథకాలకు అమలు చేస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గ్రామ సభలు జరిగినప్పుడు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నించారన్నారు. కానీ ప్రజలకు మంచి చేయాలన్న దృఢ సంకల్పంతో లాంఛనంగా నాలుగు పథకాలను ప్రారంభించగలుగుతున్నామన్నారు.
వాస్తవానికి అన్ని గ్రామాల్లో ఆదివారమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని అనుకున్నా.. అప్లికేషన్లు ఎక్కువ రావడం వల్లే దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. నాలుగు పథకాలను పూర్తిస్థాయిలో ఎప్పుడు, ఎక్కడ అమలు చేస్తామో ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. పేదవాళ్లు ఎవరు కూడా అభద్రతకు లోను కావొద్దన్నారు.
ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్ వారి పదేళ్ల పాలనలో వరి వేసుకుంటే ఉరే అన్న విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పుడు రైతు కమిటీలు, కల్లాల బాట పట్టడాన్ని తప్పుబట్టారు. కానీ తమ ప్రభుత్వం ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా బోనస్‌తో చెల్లించి కొనుగోలు చేసిందన్నారు.
పైరవీలు, అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఆదివారం 606 మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వబోతున్నామన్నారు. మంచిని విమర్శించి మరింత పలుచన కావొద్దని విపక్షాలకు హితవు పలికారు. జాబితాలో పేరు వచ్చినా వారు అర్హుల కాదని తెలితే వెంటనే క్యాన్సిల్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
నేటి సీఎం షెడ్యూల్..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతతంత్ర దినోవ్సవం సందర్భంగా ఆది వారం సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల సైనిక స్థూపం వద్ద నివాళి అర్పించి.. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి ఎయిర్‌వార్ ఫేర్‌ను సందర్శిస్తారు.
తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం కోస్గి మండలం చంద్రవంచలో ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎట్‌హోం కార్యక్రమంలో భాగస్వాములవుతారు.