calender_icon.png 15 April, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా పథకాలు

14-04-2025 02:01:05 AM

  1. మాజీ సీఎం కేసీఆర్
  2. అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు 

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): అంబేద్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం తెచ్చిన పథకాలను నేటి ప్ర భుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలని, అప్పుడే ఆయనకు ఘన నివాళి అర్పించిన వారమవుతామని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.

దేశానికి అంబేద్కర్ అందించిన సేవలను స్మరించుకున్నారు. అంటరానితనం సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమాన వాటా కోసం సామాజిక న్యాయం కోసం తన జీవిత కాలం పోరాడిన దార్శనికుడు డా.బాబాసాహెబ్ అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. భారతదేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా అంబేద్కర్ దేశ రాజ్యాంగా న్ని తీర్చిదిద్దారని అన్నారు.

అంబేద్కర్ రా జ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికిల్ 3 ద్వా రానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. అంబేద్కర్ పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టుకొని వారి స్ఫూర్తిని కొనసాగించామని, 125 అడుగుల ఎత్తున విగ్రహాన్ని నెలకొల్పి ఘనంగా గౌరవించుకున్నామని కేసీఆర్ తెలిపారు.