22-04-2025 12:12:15 AM
నాగాలాండ్ సీనియర్ అధికారుల బృందం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21(విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీలో ప్రజలకు కల్పిస్తున్న మౌలిక వసతులు, అమలు చేస్తు న్న పథకాలు భేష్ అని నాగాలాండ్ సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయ పడ్డారు. పబ్లిక్‌పాలసీ ఆన్ గుడ్ గవర్నెన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌పై నాగాలాండ్ అధికారులకు ఈ నెల 21 నుంచి 25వరకు జరుగుతున్న శిక్షణలో భాగంగా వారు జీహెచ్‌ఎంసీకి విచ్చేశారు.
సోమవారం జీహెచ్ ఎంసీ ప్రధానకార్యాలయంలో అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి వారికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగరవాసులకు అందిస్తున్న సేవలు, జీహెచ్ ఎంసీ ఆర్థిక వనరులు, మౌలికసదుపాయాలు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.
అనంతరం జవహర్‌నగర్ డంపింగ్ యార్డు అద్యయనానికి వెళ్లారు. కార్యక్రమంలో నాగాలాండ్ వివిధ విభాగాల జా యింట్ సెక్రటరీలు రెనబొమో ఒడియు, విక్వినో చలె, కుస ఫితు, సంగిట్ల జమిర్, అవేలు రుహూ, వైచింగ్యక్ కొన్యక్, మొ హ్మూ తుంగాయ్, అడిషనల్‌డిప్యూటీలు కెయిరంగ్ దింగ్ హిగుల్, పి.జమెస్‌స్వా, ఎస్.అత్సంగ్లా, డిప్యూటీ సెక్రటరీ లివిటోలి సుఖా తదితరులు పాల్గొన్నారు.