calender_icon.png 29 January, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల కోసం పథకాలు మా విధానం కాదు

27-01-2025 12:51:32 AM

  • ప్రజాసంక్షేమమే బీజేపీ పరమావధి
  • గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ మోసం
  • గణతంత్ర వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): కేవలం ఓట్లను దన్నుకోవాలనే ఉద్ధేశంతో బీజేపీ పథకాలను ప్రారంభించదని, ప్రజల అంతిమ ప్రయోజనమే తమ పార్టీ లక్ష్యమని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, అనేక రకాలుగా రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ఆరోపించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరుగుదొడ్లు, వంటగ్యాస్ కనెక్షన్, ఉపాధిహామీ, రైతులకు గిట్టుబాటు ధర.. ఇలా అందరికి అన్ని రకాల పథకాలను బీజే పీ సర్కార్ అందిస్తోందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్‌తో కలిసి కేంద్రమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితహక్కులను కాపాడుకుంటూ, బలహీనవర్గాలకు రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్‌ను ఏర్పర్చిన ఘనత దక్కించుకుందన్నారు. జమ్మూ కశ్మీర్‌లో తాము అమలు చేసే వరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గత కాంగ్రెస్ సర్కారు అమలే చేయలేదన్నారు. జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఆర్టికల్ 370ని తొలగించి, భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన చరిత్ర నరేంద్ర మోదీ ప్రభుత్వానిదని తెలిపారు.

దేశ ప్రజలకు ఎలాంటి హక్కులు, అధికారాలు ఉన్నాయో, నేడు జమ్మూకశ్మీర్‌లోని ప్రజలకు అమలుకు నోచుకున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించిం దని.. సమన్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తోందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అంబేద్కర్ జీవితంతో సంబంధము న్న ఐదు ప్రముఖ స్థలాలను అంబేద్కర్ పంచతీర్థాలుగా అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు.