* మార్చి నాటికి రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం
* కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, జనవరి 8: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మార్చి నాటికి పథకం అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ప్రకటించారు. హైవే, స్టేట్, సాధారణ రహదారులనే భేదం లేకుండా, ఏ రహదా రిపై ప్రమాదం జరిగినా పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.
నేషనల్ హెల్త్ అథారిటీ, పోలీసుశాఖ, వైద్యారోగ్యశాఖలు సమ న్వయంతో పనిచేస్తూ పథకాన్ని అమలు చేస్తాయని తెలిపారు. పథకం అ మలుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, ఈ యాక్సిడెంట్ రిపోర్ట్ ఆధారంగా పథకం వర్తిస్తుందన్నారు.
గోల్డెన్ అవర్‌ను సద్వినియోగం చేసుకుని ఎక్కువ మంది ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పథకం అమలు చేస్తున్నామని, పైలట్ ప్రాజెక్టుగా చండీగఢ్‌లో ప్రా రంభమైందని, అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.