‘బ్రాహ్మణవెల్లంల’ పూర్తికి చర్యలు: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, జూలై 11(విజయక్రాంతి) : ఎస్సెల్బీసీ సొరంగాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,200 కోట్లు కేటాయించిందని, బడ్జెట్లో నిధులకు ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్‌లోనూ పెట్టిందని చెప్పారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం మంత్రి పర్యటించారు. సిలార్‌మియాగూడెంలో దాతల సహకారంతో నిర్మించిన గ్రంథాలయం, అంగన్‌వాడీ భవనం, కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. తిప్పర్తి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ పూర్ణచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.