29-03-2025 12:03:26 AM
గజ్వేల్, మార్చి28: పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజయేందర్ రెడ్డి, సుంచు నరేందర్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం డిఇఓ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత కోసం ప్రభుత్వం గత సెప్టెంబర్ లో స్కావెంజర్లను నియమించిందని, వారికి మూడు నెలల వేతనం మాత్రమే చెల్లించాలని డిసెంబర్ నుండి వారి వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు.
వేతనాలు రాక స్కావెంజర్లు ఇబ్బందులకు గురవుతున్నారనీ వెంటనే ప్రభుత్వం స్కావెంజర్ల వేతనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కోరారు. సామాజిక కుల గణన సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సిసిఎల్ లు మంజూరు చేయాలని,ఎస్ ఎస్ సి 2024 సంవత్సర మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలన్నారు. ఎస్ ఎస్ సి 2025 మూల్యాంకన కేంద్రంలో సదుపాయాలు కల్పించాలని డీఈఓ ను కోరారు.