హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో వారం రోజులపాటు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని మంగళవారం హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఏ ప్రాంతానికి స్పష్టంగా వర్ష సూచన ఉందని ఐఎండీ చెప్పలేదు. ఈ క్రమంలో ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు. హైదరాబాద్‌తో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైన ఉంటుందని, ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 30, కనిష్ఠంగా 23 డిగ్రీల వరుక నమోదవుతాయని వివరించింది.