calender_icon.png 18 January, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు..

17-01-2025 11:30:11 PM

పట్టించుకోని మున్సిపల్ అధికారులు..

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ  పరిధిలోని దమ్మపేట రోడ్డు గల భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా అక్రమ సెల్లార్ నిర్మాణం ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా నిర్మాణం చేపట్టారు. అక్రమ కట్టడాలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేందుకు పెద్దలు నిర్వహించాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలో భారీ మొత్తంలో మున్సిపల్ అధికారులకు ముడుపులు చెల్లినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. దర్జాగా జరుగుతున్న నిర్మాణాలు ఆరోపణలు ద్రోపరుస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను అరికట్టేది ఎవరు? బీదలు నిర్మించుకుంటే వెంటనే స్పందించి తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు బడా బాబుల నిర్మాణాలు ఎందుకు తొలగించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.