calender_icon.png 9 February, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మచ్చలు మటుమాయం

09-02-2025 12:04:19 AM

ముఖం మీద మొటిమలు, గాట్లు, పుట్టుమచ్చ ల్లాంటి వాటిని దాచేయాలంటే, కొన్ని మేకప్ మెలకు వలు అనుసరించాలి. మచ్చల రంగును బట్టి వాటిని కనిపించకుండా చేసే కన్‌సీలర్ ఎంచుకోవాలి. మచ్చ ఎర్రగా ఉంటే గ్రీన్ కలిగి ఉండే కన్‌సీలర్ అద్దుకోవాలి. నల్లగా ఉంటే, ఎరుపు రంగు కన్‌సీలర్ ఎంచుకోవాలి.

ఇందుకోసం మేకప్ స్పాంజ్‌తో ఈ కన్‌సీలర్ పలుచగా అద్దుకుని, ఆ తర్వాత సాధారణ కన్‌సీలర్ మచ్చ ఉన్న ప్రదేశంలో అద్దుకోవాలి. ఇందుకోసం మేకప్ స్పాంజ్ మీద కన్‌సీలర్ వొంపి, మచ్చతో పాటు, దాని చుట్టూరా అద్దుకోవాలి. అలాగే అసహజమైన గీతలు కనిపించకుండా, ముఖం మొత్తం ఫౌండేషన్ సమంగా పరుచుకునేలా స్పాంజ్‌తో అద్దుకోవాలి.

తర్వాత మేకప్ దవడ ఎముక దిగువ వరకూ బ్లెండ్ చేయాలి. తర్వాత పెద్ద బ్రష్‌తో పౌడర్‌ను తీసుకుని వృత్తాకారంలో ముఖం మీద అద్దుకోవాలి. మచ్చ మీద పౌడర్ పరుచుకోవడం వల్ల అది చర్మంలో కలిసిపోతుంది.