కష్ట పడి పైసాపైసా కూడబెట్టుకొన్న డబ్బును ఎవరైనా మోసం చేసి దోచుకుంటే గుండె తరుక్కుపోతుంది. చిట్టీల పేరుతో జరిగే మోసాల గురించిన వార్తలు నిరంతరం వింటూనే వున్నాం. అయి నా, ఎక్కడో ఓ చోట ఎవరో కొందరు మోసపోతూనే ఉండటం దయనీయం. హైదరాబాద్, బాలానగర్ ప్రాంతంలో ఒక దంపతులు చిట్టీ ల పేరుతో ఇటీవల రూ.నాలుగున్నర కోట్లు సేకరించి, పరారైనట్టు తాజాగా వార్తలు వచ్చాయి. వీరిద్వారా ౩౪ మంది నష్టపోయార్ట. ఇలా మోసం చేసిన వారిని గట్టిగా అడిగే పరిస్థితులు కూడా బాధితులకు లేకుండా పోతున్నది.
సహర్ష్, హైదరాబాద్