calender_icon.png 7 March, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోన్ పేరుతో కొంపముంచిన కేటుగాళ్ళు

06-03-2025 11:06:17 PM

యాచారం: ముద్ర లోన్ వచ్చిందంటూ ఓ వ్యక్తికి కేటుగాళ్లు పెద్ద షాక్ ఇచ్చారు. యాచారం మండలం గన్ గల్ గ్రామానికి చెందిన రామన్న (37) ఉదయం ఫోన్ కాల్ ద్వారా ముద్ర లోన్ ద్వారా ఐదు లక్షలు రుణం మంజూరు అయిందని రుణం పూర్తగా అందాలంటే కొంత అమౌంట్ పంపాలని కోరగా ఫోన్ పే ద్వారా విడతల వారీగా 45490 రూపాయలు పంపాడు. లోన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటే తను మోసపోయానని తెలుసుకొని స్థానిక యాచారం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా అతని నుండి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి తెలిపారు.