calender_icon.png 25 September, 2024 | 2:08 PM

మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం: కేటీఆర్

25-09-2024 11:38:58 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): మూసీ నది సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్‌లో పూర్తయిన 133 ఎంఎల్‌డి ప్లాంట్‌ను బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ తదితురులతో కలిసి ఆయన బుధవారం సందర్శిస్తాను. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత ఎస్టీపీ పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. కూకట్ పల్లి ఎస్టీపీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ను మురికి నీటి రహిత నగరంగా చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ హయంలో ఎస్టీపీలను ప్రారంభించామన్నారు.

తన ప్రభుత్వ హయంలోనే కేటీఆర్  రూ.3,866 కోట్లు మంజూరు చేసిందని తెలిపింది. హైదరాబాద్ 100% మురుగునీటి శుద్ధి సామర్థ్యానికి చేరుకోవడం ఆనందంగా ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.వేల కోట్ల కుంభకోణంకు తెరలేపిందని సంచలన వ్యాఖ్యాలు చేసింది. మాసీ టెండర్లను పాకిస్థాన్ కంపెనీలకు కట్టబెడుతుందని ఆరోపించారు. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీరు మూసీ నదిలోకి వెళ్లోందని, 94 శాతం స్వేచ్ఛమైన నీరు వెళ్తున్నప్పుడు మళ్లీ మూసీ శుద్ధి ఎందుకు?, మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.