09-04-2025 08:41:31 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఇటీవల ఎల్లారెడ్డి మండల ఎంఈఓ గా నియమితులై బాధ్యతలు స్వీకరించిన రాజును బుధవారం నాడు ఎల్లారెడ్డి మండల ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు ఎం వెంకటయ్య మాట్లాడుతూ... గత కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డి మండల ఎంఈఓ గా పని చేసిన వెంకటేశం పదవి విరమణ పొందిన అనంతరం రాజు ఎంఈఓ గా నియమితులై బాధ్యతలు చేపట్టడంతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు. భవిష్యత్తులో రాజు ఎంఈఓ గా మంచి సేవలు అందించి ఎల్లారెడ్డి మండలంలో విద్యాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనిరాం, జిల్లా ఉపాధ్యక్షులు జ్ఞానేశ్వర్, కోశాధికారి సాయిలు, కార్యవర్గ సభ్యులు నౌషా, దాసిరాం, సంగ్య, సవాయి, బేల, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.