26-03-2025 11:05:39 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ను తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. బుధవారం బెల్లంపల్లిలోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి ఎస్సీ, ఎస్టీ రుణాల విడుదల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనిపై స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు చొరవ చూపుతానని హామీ ఇచ్చారు.