calender_icon.png 20 September, 2024 | 2:48 AM

వర్గీకరణను రద్దు చేయాలి

19-09-2024 08:20:40 PM

జాతీయ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్

నిర్మల్,(విజయక్రాంతి): ఆగష్టు 1న సుప్రీం కోర్టు ఇచ్చిన ఎస్సి ఎస్టీ వర్గీకరణ తీర్పును వెనక్కు తీసుకోవాలని క్రిమిలియర్ రద్దు చేయాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ చైర్మన్ సుప్రీం కోర్టు అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్, రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తో కలిసి మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ క్రిమిలియర్ గత 1975 నుంచి గెలిసిన పాలకులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలలో చైతన్యం వచ్చి ప్రభుత్వాలపై తిరగబడినప్పుడు గత్యంతరం లేక ప్రజల, కులాల, మతాల మధ్య వివాదాలను సృష్టించి వాస్తవాలను పక్కకు నెట్టేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోక కొట్లాడుకుంటున్నారు.

1975 పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ దళితులను విభజించి వర్గీకరణ తెచ్చిందే మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆని తరువాత తరువాత ఉమ్మడి రాష్ట్రంలో దళిత బహుజనులు కలిసి ఉన్నరాని విడ గొట్టలని ఆ రోజు టీడీపీ చంద్రబాబు నాయుడు, మంద కృష్ణమాదిగ ని అడ్డం పెట్టుకొని వర్గీకరణ చేశాడని వర్గీకరణ చేయడం రాష్ట్రాలకు ప్రభుత్వాలకు కోర్టులకు లేవని అదే కోర్టు కొట్టేసింది. ఇతర రాష్ట్రాలలో ఇతర కేసులలో ఆయా కోర్టులు కొట్టేసినాయి. ఇప్పుడు రాజ్యాంగాన్ని తొలగించి ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలని బిజెపి దానికి అనుబంధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిడిపి చంద్రబాబు నాయుడు జనసేన్ పవన్ కళ్యాణ్ పార్టీ ఆలోచిస్తున్నాయని అన్నారు. 

దళిత గిరిజన బహుజనులు కలిసి ఎదిరించి పోరాడకుంటే భవిష్యత్ తరాలకు భవిష్యత్ లేదని అన్నారు. అందుకే వర్గీకరణ కాదని రాజ్యాధికారం కావాలని వడేవ్వాడు మన రిజర్వేషన్ తొలగించడానికి బిసి లు ముందుకు వస్తె మనదే పరపాలన ఆని అన్నారు. మనం బిచ్చం అడగడం కాదు ఒక్కటై రాజ్యాధికారం సాధిద్దామని అన్నారు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేసిన వర్గీకరణ కమిటీని రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రివ్వు పిటిషన్ లు వందకు పైగా వేస్తే అసలు ఆ పిటిషన్ లాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి కమిటీ వేయడం చూస్తుంటే విచిత్రంగా ఉందన్నారు. అదేవిధంగా ఎస్సి ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 30 న ఛలో సచివాలయం హైదారాబాద్  ముట్టడికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో అల్ ఇండియా ఎస్సి ఎస్టీ అడ్వకేట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుల రాజలింగం, జిల్లా అధ్యక్షులు సీనియర్ రత్నం రావు, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.