29-01-2025 12:46:48 AM
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ అల్ట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆయనతోపాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం, మరో 16 మందిపై బెంగళూరు లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
2014లో వీరంతా ఓ హనీ ట్రాప్ కేసులో తనను తప్పుగా ఇరికించార ని, అంతేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ విధుల నుంచి తనను తొలగించారంటూ మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు.
అంతేకా కుండా కులం పేరుతో తనను దూషించి బె దిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు.