23-03-2025 08:26:51 PM
దళితుడిని బెదిరించి కిడ్నాప్ కు ప్రయత్నించిన సినీ నిర్మత మేడికొండ వెంకట మురళీకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలి..
దళిత కుటుంబానికి రక్షణ కల్పించాలి..
కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్..
సంగారెడ్డి (విజయక్రాంతి): పుల్కల్ మండలం గోంగూలూరు గ్రామానికి చెందిన దళితుడు పల్లె సంజీవయ్య సోదరుడు పల్లె బాలయ్య కొడుకు పల్లె క్రాంతిని కొట్టి కిడ్నాప్ చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అత్యాయత్నం కేసు, కిడ్నాప్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలో ఉన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ తో కలిసి మాట్లాడారు.
పుల్కల్ మండలం గొంగులూరు గ్రామంలో సర్వేనెంబర్ 794లో పల్లె సంజీవయ్య 6 ఎకరాలు భూమి ఉండగా అందులో ఎకరన్నార భూమిని వేరే వాళ్లకు విక్రయించాడని కానీ తన భూమి పక్కనే భూమి ఉన్న సినీ నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ దళితుడైన పల్లె సంజీవయ్య భూమిని కాజేయాలని చూశాడని, శనివారం రాత్రి సంజీవయ్యను అతని సోదరిని కుమారుడు క్రాంతిని కండ్లల్లో కారం కొట్టి ఆ తర్వాత క్రాంతిని కిడ్నాప్ చేశారన్నారు. వెంటనే కిడ్నాప్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ముఖ్య కారణమైన సినీ నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.