హుజూర్ నగర్,(విజయక్రాంతి): పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్య, ఉద్యోగ,రాజకీయ, భూమి వ్యయసాయ, అభివృద్ధి, సంక్షేమం గురించి శ్వేత పత్రం విధుల చేయాలి. కులగణ వెంటనే చేపట్టి పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్స్ 15% నుండి 25%, ఎస్టీ రిజర్వేషన్స్ 6% నుండి 10%, బీసీ రిజర్వేషన్స్ 27% నుండి 50% పెంచాలని, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, పూర్వ ప్రభుత్వ న్యాయవాది తల్లమల్ల హసేన్ అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మాల మహానాడు సమావేశం లో పాల్గొని మాటాడుతూ... ఇటీవల ఎస్సి, ఎష్టి రిజర్వేషన్స్ గురించి గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశం లో కొన్ని కులాలు ఆందోళనకు గురైయినయని, ఈవిషయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాలకు సమన్యాయం చేయుటకు కలిసి రావాలని అన్నారు.
కులాలను వర్గీకరణ చేయటం వలన న్యాయం జరుగదని, ఎక్కడైతే వెనుకబడిన కులాలు ఉన్నయో వారిని గుర్తించి, వారికీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. రిజర్వేషన్స్ శాతం పెంచి, పెంచిన రిజర్వేషన్స్ వెనుక బడిన కులాలకు ఇవ్వాలని, ఉమ్మడి రిజర్వేషన్స్ గ్రూపులుగా విభజన చేయరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 25 సంవత్సరాల నుండి నుండి 59 ఎస్సీ కులాలలో మాదిగ సోదరులు ఎక్కువశాతం ఉద్యోగాలు, ఎస్సి కార్పొరేషన్ నిధులు, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణి, దళిత బంధు పతకం, గురుకుల పాఠశాల, కళాశాల అడ్మిన్స్ 95%, ఎస్సి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను 95% అనుభవిస్తూ, మాల సోదరులను బదనాం చేస్తున్నారు.
వారి తప్పుడు ప్రచారాన్ని రాజకీయ పార్టీలు కొన్ని ప్రజా సంఘాలు నమ్ముచున్నారు. ఈ విధానం మంచిది కాదు అన్నారు. ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్స్ అమలు కోసం మాలమహానాడుతో మాదిగ సోదరులు కలిసి ఉద్యమాలు చేయాలని కోరారు. ఈ సమావేశం లో మాలమహానాడు హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ, ఇట్టమళ్ళ శ్రీనివాస రావు, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఇట్టమల్ల బెంజిమెన్, మాల మహానాడు రాష్ట్ర కమిటీ మెంబెర్ వీసం రాములు, ఇట్టమల్ల రామకృష్ణ, ఇట్టమల్ల విమన్ తదితరులు పాల్గొన్నారు.