వర్గీకరణను అమలు చేసినా.. ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, తమిళనాడులో రిజర్వేషన్లను పెంచిన తర్వాతే వర్గీకరణను అమలు చేశారన్నారు. మాలల్లో ఒక భయం ఉందని, ఏకసభ్య కమిషన్ ఇచ్చిన డాటాను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. ఎస్సీలకు 15 శాతం బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని సూచించారు.