23-02-2025 05:03:30 PM
మందమర్రి (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న 15 శాతం నుండి 18 శాతానికి పెంచాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, దళిత నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 15 నుండి 18 శాతానికి పెంచాలని తెలంగాణ ఉద్యమకారులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ మేరకు రిజర్వేషన్ కోటాను 18 శాతం పెంచాలని, త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో దళితుల సంక్షేమానికి 18 శాతం నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతం పెంచాలని వివేక్ వెంకట స్వామి డిమాండ్ చేయడంతో రాష్ట్రంలోని దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు రిజర్వేషన్ పెంపుదల కోసం వివేక్ వెంట కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.